AP News | ఏపీలోని రైతులకు శుభవార్త! ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద అన్నదాతలకు రెండో విడత పెట్టుబడి సాయం నిధులు విడుదల కానున్నాయి. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ నిధులను విడుదల చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ నిధులు కూడా అదే రోజు విడుదల కానున్నాయి.
ఎకరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు, ఏపీ ప్రభుత్వం ఇచ్చే రూ.5వేలు కలిపి మొత్తంగా రూ.7వేలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు ఈ సందర్భంగా మంత్రి మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన రైతుల వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి, అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్పీఎస్ఏలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న రైతులు సులభంగా రిజిస్టర్ చేసుకునేలా ఆన్లైన్ వ్యవస్థను సరళతరం చేయాలన్నారు.