తిరుమల : తిరుపతి లక్కీ ఫర్ యూ ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ (TTD) అన్న ప్రసాదం ట్రస్టుకు (Anna Prasadam Trust ) ఒక కోటి 10వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈవో, అదనపు ఈవో అభినందించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో 9Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 28 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,656 మంది భక్తులు దర్శించుకోగా 24,360 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా స్వామివారికి రూ. 4.15 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.