NIA | కర్నూల్ : ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ పట్టణంలో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూల్ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనే సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానం ఉండటంతో.. అధికారులు ఆ ఇద్దరి నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఒకరు ఆటో నగర్లో నివాసం ఉంటుండగా, మరొకరు ఓల్డ్ సిటీలో నివాసముంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసు రెస్ట్ హౌస్కు తరలించారు. వారిద్దరిని విచారిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్లో నిన్న ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పీఎఫ్ఐతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. అయితే అతను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.