Chandrababu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్, మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్టేజ్‌పై పుష్పగుచ్ఛం అందించి కంగ్రాట్స్ చెప్పారు. చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పట్టరాని ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్‌పై మోదీ – చంద్రబాబు స్పెషల్ మూమెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
#WATCH | Vijayawada: Andhra Pradesh Chief Minister, N Chandrababu Naidu hugs Prime Minister Narendra Modi, after taking the oath. pic.twitter.com/35NLmYvF0q
— ANI (@ANI) June 12, 2024
కేసరపల్లిలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, రామ్‌చరణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నందమూరి, నారా, పవన్ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
Also Read..
Modi 3.0 Cabinet | బండి సంజయ్ సహా మోదీ కేబినెట్లోని 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
Nirmala Sitharaman | వరుసగా రెండోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్
Parliament Session | 24 నుంచి లోక్‌సభ.. 27 నుంచి రాజ్యసభ సమావేశాలు : కిరెణ్ రిజుజు