అమెరికాలో విషాదం నెలకొంది. ఏపీకి చెందిన యువకుడు స్నానానికి చెరువులో దిగి మరణించాడు. పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోవడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాస్, రమ దంపతుల కుమారుడు సాయి శ్రీ హరికృష్ణ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి కాగానే మూడు నెలల కిందట అక్కడే ఉద్యోగం కూడా సంపాదించాడు. ఇదిలా ఉంటే శనివారం తన పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అక్కడే చెరువులో స్నానం చేస్తుండగా అందులో మునిగి చనిపోయాడు.
పుట్టిన రోజు నాడే దేశం కాని దేశంలో తమ కుమారుడు మరణించడంతో హరికృష్ణ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హరికృష్ణ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.