Earthquake | ఏపీలోని విశాఖపట్నంలో(Visakhapatnam) ఆదివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది(Earthquake). గాజువాక, మంగళపాలెం సాగర్ నగర్, పెద వాల్తేరు, తాటిచెట్ల పాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్బీ కాలనీల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ భూకంపం కాకినాడకు 225 కి.మీ. దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వచ్చినట్లు తెలిసింది. అలాగే విజయనగరం జిల్లాల్లో కూడా పలు చోట్ల భూమి కంపించినట్లు సమచారం.