అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం రేపు(గురువారం) 8 వందలకు చేరుకోనుంది. ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 24న అమరావతి ప్రజాదీక్ష పేరుతో 24 గంటల సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులను ఉద్యమ నాయకులు ఆహ్వానించారు.
కాగా రైతుల ఉద్యమం ఈ రోజు 799వ రోజుకు చేరుకుంది. అమరావతి రాజధాని సమస్యపై దశల వారీగా ఆందోళన చేపడుతూ రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. అమరావతి నుంచి తిరుపతి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి అమరావతి రాజధాని కొనసాగించేలా సద్బుద్ధి ఇవ్వాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు రాజధానుల నిర్మాణం చేపడుతామని స్వయాన అసెంబ్లీ తీర్మాణం చేసి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుండగా అమరావతి రైతులు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.
ప్రభుత్వం కూడా వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తున్న సమయంలో స్పందించిన ప్రభుత్వం తాము మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. దీంతో వ్యవహారం సద్దుమణిగిందని భావించిన రైతులకు ఇటీవల మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేసేందుకు సన్నద్దమయ్యారు. ఉద్యమం రేపు 8వందల రోజుకు చేరుకుంటుండడంతో ఉద్యమ నేతలు భవిష్యత్ కార్యచరణకు పిలుపుచిచ్చే అవకాశముంది.