అమరావతి : ఏపీలో టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జాచేశారని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Kakani Goverdhan Reddy) అన్నారు. నెల్లూరులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి సోమిరెడ్డి( Somireddy ) అక్రమాలపై పోరాటాలు చేసినందుకే తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు.
ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి అరాచక పాలనకు తెర దించుతున్నారని మండిపడ్డారు . వైఎస్ జగన్ నేతృత్వంలో ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం దేవుడి భూములను కాపాడిందని వెల్లడించారు. దమ్ము, ధైర్యం ఉంటే సోమిరెడ్డి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 1980లో హరిప్రసాద్ రెడ్డి అనే దాత కాకుటూరు శివాలయానికి భూములివ్వగా సోమిరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. కోటి రూపాయలు తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారని విమర్శించారు.