Tirupati | రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీస్ సంస్థ తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
వారంలో మంగళ, గురు, శనివారాల్లో రాజమండ్రి నుంచి తిరుపతికి విమానాలు నడవనున్నాయి. రాజమండ్రి నుంచి ఉదయం 9.40 గంటలకు బయల్దేరి 11.20 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి ఉదయం 7.40 గంటలకు బయల్దేరి ఉదయం 9.25 గంటలకు రాజమండ్రికి చేరనుంది. ఈ మేరకు అలయన్స్ ఎయిర్ సర్వీస్ అధికారులు వివరాలు వెల్లడించారు.