TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే, మార్చి 30న ఆదివారం ఉగాది ఆస్థానం సందర్భంగా సహస్ర దీపాలకరణ సేవ మినహా అన్ని సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో మార్చి 25, 30 తేదీల్లో ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే బ్రేక దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 24, 29వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని దేవస్థానం కోరింది.