అమరావతి : కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గం గా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) ప్రకటించారు. ముఖ్యమంత్రి(Chief Minister) గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మొట్టమొదటిసారి తన నియోజకవర్గం కుప్పం (Kuppam) లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలకు వరాలు కురిపించారు.
వచ్చే ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. అన్నింట్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. కుప్పంలో రౌడియిజం చేసే వారికి ఇదే చివరి రోజని అన్నారు. ఇకపై రౌడీయిజం(Rowdyism), గంజాయి, అక్రమ వ్యాపారాలు (Illegal businesses) చేసే వీలు లేదని వివరించారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అభివృద్ధిని పరుగుపెట్టిస్తానని తెలిపారు. నియోజకవర్గానికి వందకోట్లు కాదు. ఎన్నికోట్లయినా ఇస్తా, అవుటర్ రింగ్, టౌన్రోడ్లు, అన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని అన్నారు.
కుప్పం నియోజకవర్గానికి విమానాశ్రయం
నియోజకవర్గంలో రైతులు పండించిన పంటలు, వివిధ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతులు చేసేందుకు విమానాశ్రయం (Airport) ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు. నియోజకవర్గ రైతులు అన్ని రకాల పంటు పండిస్తున్నారని,వారు పండించే పంటలకు సరైనా గిట్టుబాటు కల్పించడంతో పాటు విదేశాల్లోనూ కుప్పం రైతులకు గుర్తింపు తీసుకువస్తామని అన్నారు.
రెండు నూతన మండలాల ఏర్పాటు
ప్రజల కోరిక మేరకు నియోజకవర్గంలో మరో రెండు మండలాల ఏర్పాటుకు(New Mandals)చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రెండు మండలాలకు అదనంగా మల్లనూరు, రాళ్లవరుగూరి మండలాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకు రూ.4 కోట్లచొప్పున, మేజర్ పంచాయతీలకు రెండుకోట్లు్, మైనర్ పంచాయతీలకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేశారు.
ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచినీరు అందజేస్తానని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కరువు నీరు రాకుండా చర్యలు తీసుకుంటానని, అవసరమైతే లిఫ్ట్‌ల ద్వారా నీరందిస్తానని తెలిపారు. కుప్పంను విద్యా హబ్‌గా చేస్తానని అన్నారు.