తిరుమల: తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో నుంచి ఆలయ గోపురం పైనుంచే విమానం వెళ్లింది. నిజానికి ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని ఆగమశాస్త్ర నిబంధనలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే తిరుమలను నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఆలయంపై నుంచి విమానాలు వెళుతుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మార్చి నెలలో ఒకేరోజు తిరుమల ఆలయం సమీపంలో ఏకంగా ఎనిమిది విమానాలు వెళ్లాయి.
మే నెలలో ఆలయంపై నుంచి మూడు విమానాలు వెళ్లాయి. అయితే కొన్ని నెలల క్రితమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. తిరుమలకు విమానాలు రాకుండా నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అప్పుడప్పుడూ డ్రోన్లు కూడా ఎగరడం భక్తులను ఆందోళను గురి చేస్తున్నది.