హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఏపీ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైలీ ఫ్లైట్ నడపనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి విజయవాడ-బెంగళూరు మధ్య విమాన సర్వీసులు తిరుగనున్నాయి. టికెట్ ధరలు ఎకానమీ క్లాసులో రూ.5వేల వరకు ఉంది. ప్రతిరోజూ సాయంత్రం 4.05 గంటలకు బెంగళూరులో బయల్దేరనున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ IX2516 విమానం 5.40 గంటలకు విజయవాడ చేరుతుంది.
విజయవాడ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరు చేరుతుంది. మరోవైపు విజయవాడ-ముంబై మధ్య జూన్ 15 నుంచి ఎయిరిండియా డైలీ సర్వీస్ ప్రారంభమైంది. రోజూ సాయంత్రం మంబైలో బయల్దేరనున్న ఈ విమానం 5.45 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.10కి గన్నవరంలో బయలుదేరి రెండు గంటల్లో ముంబై చేరుకుంటుంది. ఈ విమానంలో ప్రారంభ ధరను రూ.5,600గా నిర్ణయించారు.