Congress List | ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను ఆదివారం ఏఐసీసీ విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జాబితాను విడుదల చేసింది.
శ్రీకాకుళం లోక్‌సభా స్థానానికి డాక్టర్ పరమేశ్వరరావు, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బొబ్బిలి శ్రీను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
అమలాపురం (ఎస్సీ) లోక్‌సభా స్థానం నుంచి జంగా గౌతం, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి గొల్లు కృష్ణ, విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వల్లూరు భార్గవ్, ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సుధాకర్ రెడ్డి, నంద్యాల నుంచి లక్ష్మీ నర్సింహ యాదవ్, అనంతపురం లోక్‌సభ స్థానంలో మల్లికార్జున్, హిందూపురం లోక్‌సభా స్థానానికి సమద్ షాహీన్ అభ్యర్థిత్వాలను ఏఐసీసీ ఖరారు చేసింది.
వచ్చేనెల 13న ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో పోలింగ్ జరుగనున్నది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విపక్షాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు పోటీ చేస్తున్నాయి.