Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే లేపింది. మహా ప్రసాదం తయారీలో వాడే నెయ్యి మాత్రమే కాదు.. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో తేలడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమమైంది. దీంతో శ్రీవారి ప్రసాదాల తయారీకి వాడే వస్తువులను సరఫరా చేసేందుకు టీటీడీ కొత్తగా బిడ్లను పిలిచింది. ఇందులో జీడిపప్పు సరఫరా చేసేందుకు పలాసకు చెందిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రొడక్ట్స్ బిడ్ను దక్కించుకుంది.
శ్రీవారి లడ్డూ తయారీ కోసం 30 టన్నుల జీడిపప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రొడక్ట్స్ కంపెనీ గురువారం తిరుమలకు పంపించింది. దీనికి సంబంధించిన వాహనాన్ని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. 50 ఏండ్ల తర్వాత మళ్లీ తిరుమలకు పలాస నుంచి జీడిపప్పు సరఫరా చేయడం పట్ల ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రొడొక్ట్స్ కంపెనీ అధినేత సంతోశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, గత ప్రభుత్వం ఐదేళ్లపాటు నాణ్యత లేని జీడిపప్పును వినియోగించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇకపై నాణ్యమైన పలాస జీడిపప్పునే శ్రీవారి ప్రసాదాల తయారీలో వాడతామని తెలిపారు.
పలాస నుంచి తిరుమలకు జీడిపప్పు
శ్రీవారి లడ్డూ తయారీకి 30 టన్నుల జీడిపప్పును పంపిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్
50 ఏళ్ళ తర్వాత తొలిసారి పలాస నుంచి తిరుమలకు జీడిపప్పు
జీడిపప్పు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు, రాష్ట్రమంత్రి… pic.twitter.com/aLr5cXbVEM
— BIG TV Breaking News (@bigtvtelugu) September 26, 2024