అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్తే అక్కడ వేషం వేసి స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని, కాని సమస్యలు మాత్రం పరిష్కరించరని సినీనటుడు నారాయణమూర్తి వ్యాఖ్యలు చేశారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహి స్తున్న జైల్‌భరో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి శిబిరం నుంచి గాజువాక వరకు కార్మికులు నిర్వహించిన కార్మికుల ర్యాలీలో నారాయణ మూర్తి మాట్లాడుతూ ఎక్కడికెళ్తే అక్కడి వేషం మార్చే అలవాటున్న మోదీ విశాఖ వస్తే ఉక్కు కార్మికుడి వేషంలో రావాల న్నారు. దీంతో ప్రధానికి కార్మికులు, నిర్వాసితుల కష్టం తెలుస్తుందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.