అమరావతి : అచ్యుతాపురం (Achyutapuram) ఎస్.ఇ.జెడ్‌లోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యానారాయణ (Botsa Satyanarayana) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విశాఖ కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఆవేదన వర్ణనాతీతమన్నారు.
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం( Government Job) ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. పరిహారం చెక్కులు ఇచ్చిన తర్వాతే డెడ్ బాడీస్ తరలించాలన్నారు. గతంలో ఎల్.జి పాలిమర్స్ ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారని ఆయన తెలిపారు.