తిరుమల : తిరుమల(Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన తెలంగాణవాసుల్లోని ( Telangana Residents) ఇద్దరు ప్రమాదానికి ( Road Accident ) గురయ్యారు. తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకుని శనివారం తెల్లవారుజామున తిరుమల నుంచి తిరుపతికి స్కార్పియో వాహనంలో బయలు దేరారు.
వీరు ప్రయాణిస్తున్న వాహనం మొదటి ఘాట్రోడ్డులో (Ghat Road) 19వ మలుపు వద్ద డివైడర్ను ఢీ కొట్టింది . దీంతో వాహనం పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులకు గాయాలు కాగా మరికొందరు సురక్షితంగా ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇంకా క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.