అమరావతి : కేంద్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల (Union Ministers ) కాన్వాయ్కి ప్రమాదం (Convoy Accident) జరిగింది. ఏపీలోని విశాఖపట్నంకు వచ్చిన కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి కుమారస్వామి (Kumara Sharma), సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ( Srinivas Varma) ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో కార్లు ఒకదాని వెనుక ఢీ కొన్నాయి.
ఇటీవల కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రూ. 11,440 కోట్లు మంజూరు చేసిన అనంతరం తొలిసారిగా గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visaka Steel ) సందర్శనకు వచ్చిన కుమారస్వామికి ఎయిర్‌పోర్టులో కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యులు విశాఖకు కాన్వాయిలో బయలు దేరారు. కొంత దూరం వెళ్లిన తరువాత షీలానగర్ వద్ద ముందు వెళ్తున్న కాన్వాయిలో ఒక కారు డ్రైవర్ సడెన్‌గా బ్రెక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జీవీఎల్‌కు చెందిన కారుతో పాటు మరో మూడు కార్లు ధ్వంసమయ్యాయి.