అమరావతి : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (Abdul Kalam) దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. కలాం వర్ధంతి సందర్భంగా శనివారం ఎక్స్ వేదిక ద్వారా నివాళి అర్పించారు. దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్రపతి (President) గా దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు.
‘కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి’ అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ కలాం అని పేర్కొన్నారు. మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.
Buggana Rajendranath | అది శ్వేతపత్రం కాదు.. సాకుల పత్రం.. చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు