Srisailam | శ్రీశైలం : శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికంగా ఉన్న గోడపై నుంచి ఓ యువతి నిన్న అడవిలోకి దూకింది. రాత్రంతా శిఖరేశ్వరం అడవిలోనే యువతి గడిపింది. సమాచారం అందుకున్న శ్రీశైలం పోలీసులు నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం శిఖరేశ్వరం అడవిలో యువతిని పోలీసులు గుర్తించారు. అడవి నుంచి యువతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బాధిత యువతిని తెనాలి మండలం కొలకలూరుకు చెందిన వెన్నెలగా గుర్తించారు. అనంతరం వెన్నెల తల్లిదండ్రులకు శ్రీశైలం పోలీసులు సమాచారం అందించారు. యువతి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి.. నిప్పులు చెరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | అదానీ దొంగ అని రాహుల్ అంటే.. రేవంతేమో అలాయ్ బలాయ్ చేసుకుంటడు : హరీశ్‌రావు
RRR : Behind & Beyond | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!