AP News | ప్రకాశం జిల్లాలో ఓ మహిళ మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఆర్టీసీ బస్సుకు అడ్డంగా రహదారిపై కూర్చుని నానాయాగీ చేసింది. తనకు క్వాటర్ మందు ఇప్పించాలని.. మద్యం ఇచ్చే దాకా అక్కడి నుంచి కదలేది లేదని భీష్మించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు బస్టాండ్ నుంచి ఓ ఆర్టీసీ బస్సు బయల్దేరింది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ బస్సుకు అడ్డంగా రోడ్డుపై కూర్చుంది. తనకు క్వాటర్ మందు కావాలని.. లేదంటే బస్సును కదలనివ్వనని భీష్మించుకుని కూర్చుంది. దీంతో అరగంటసేపు బస్సును అక్కడే నిలిపివేశారు. ఎంతసేపటికి ఆ మహిళ కదలకపోవడంతో అసహనానికి గురైన ప్రయాణికులు, స్థానికులు ఆమెను బలవంతంగా పక్కకు లాగేశారు. అప్పుడు బస్సు ముందుకు వెళ్లింది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ గూడేనికి చెందిన మహిళగా భావిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో క్వాటర్ మందు కావాలంటూ ఆర్టీసీ బస్సు ముందు అడ్డంగా కూర్చున్న మహిళ
యర్రగొండపాలెంలోని పుల్లల చెరువు రోడ్డులో ఘటన
క్వాటర్ మందు కావాలంటూ మద్యం మత్తులో అరగంటకు పైగా వీరంగం సృష్టించిన మహిళ
విస్తుపోయి, చివరకు ఆమెను రోడ్డు పక్కకు లాగేసి వెళ్ళిపోయిన డ్రైవర్ pic.twitter.com/xmEyln7jqM
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2025