గుంటూరు : (ACB Trap) కాంట్రాక్టర్ను లంచం ఇవ్వాలని వేధించిన నరసరావుపేట మున్సిపల్ ఉద్యోగి.. ఏసీబీ వలకు చిక్కాడు. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నిఘా పెట్టి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెంకు చెందిన వడ్లమూడి శివరామయ్య అనే కాంట్రాక్టర్ రెండేండ్ల క్రితం నరసరావుపేట పట్టణం పరిధిలో మున్సిపాలిటీ కింద రెండు సీసీ రోడ్లను నిర్మించాడు. తనకు రావాల్సిన నిధుల కోసం సీనియర్ అసిస్టెంట్ మధును శివరామయ్య సంప్రదించాడు. బిల్లు విడుదల చేయాలంటే రూ.8 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతమొత్తం ఇవ్వలేనన్నప్పటికీ మరీ వేధింపులు ఎక్కువవడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి కాంట్రాక్టర్ నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు గుంటూరు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..