తిరుపతి : తిరుపతి (Tirupati) జిల్లాలో ఓ కానిస్టేబుల్ చర్యను నిరసిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ (Police station) పరిధిలో మణికంఠ అనే వ్యక్తి , తన భార్య మరొకరితో పారిపోయేందుకు కానిస్టేబుల్ (Constable) సహకరించాడని ఆందోళన వ్యక్తంచేశాడు.
ఇదే విషయమై కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల కిందట స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 70 శాతం కాలిన గాయాలతో అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. భార్యను మరిచిపోవాలని కానిస్టేబుల్ శ్రీనివాసులు బెదిరించాడని , లేకపోతే చోరీ కేసులో లోపల వేస్తానని బెదిరించాడని బాధితుడు మణికంఠ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.