Tirumala | తిరుమలలో ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆశ్విని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా, అంతకుముందు ఇదే ప్రాంతంలో ఒక బైక్ స్కిడ్ కావడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఆయిల్ లీకై రోడ్డుపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఆరు రోజుల క్రితం కూడా తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద గోడను ఢీకొట్టింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండటంతో బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. లేదంటే ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న లోయలోకి జారిపడే అవకాశం ఉండేది. కానీ అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో భక్తులంతా ఊపిరి తీల్చుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్
తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం
మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా
నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు https://t.co/sNYubMfNhx pic.twitter.com/QanxcJ1176
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025