అమరావతి : తిరుపతిలోని(Tirupati) అలిపిరి(Alipiri) కూడాలిలో కారులో(Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆకస్మిక పరిణామానికి భయంతో భక్తులు పరుగులు తీశారు. తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసకొచ్చారు. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.