అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మావిగన్ ( మచిలిపట్నం, విజయవాడ, గుంటూరు ( Mavigun ) ప్రాంతాన్ని వైసీపీ సరైనా, ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) మరోసారి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణుల భేటీలో ఆయన మాట్లాడారు.
రాజధాని బెస్ట్ ఆఫ్షన్‌గా ప్లాన్ ఏ కింద విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్, అమరావతి శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపామని అన్నారు. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్‌ను మావిగన్‌ను సూచించామని వివరించారు. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు మావిగన్‌కు రూ. 20 వేల కోట్లు సరిపోతుందని వెల్లడించారు.
అమరావతి పేరుతో దోచుకోవడానికే చంద్రబాబు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాది నుంచి తాను పాదయాత్ర చేపట్టనున్నామని, ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు అసలైన సినిమా చూపిస్తారని అన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోసాలుగా తేలిపోయాయని విమర్శించారు. ఈ రెండేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని ఆరోపించారు.