AP News | ఏపీలోని విశాఖలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అపశ్రుతి నెలకొంది. గాజువాక సమీపంలో ఆటో నగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలింది.
ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కిమ్స్ ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.