అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్ సమీపంలో స్టేట్ హైవేపై సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
మృతుల్లో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని చిత్తూరు వాసులుగా టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు గుర్తించాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.