అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు (AP Floods ) రాష్ట్రంలో 46 మంది ప్రాణాలు(Died) కోల్పోయ్యారని ప్రభుత్వం అధికారిక(Official) ప్రకటన విడుదల చేసింది. సుమారు 540 వివిధ రకాల పశువులు(Animals) మృతి చెందాయని వివరించింది. 4.90లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగగా, 49వేల ఎకరాల్లో ఉద్యాన , 200 ఎకరాల్లో సెరీకల్చర్కు నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.
మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. 76 విద్యుత్ ఉపకేంద్రాలు ముంపుబారిన పడగా 1,283 ఎల్టీ ఎలక్ట్రిక్ స్తంభాలు, 1,668, 11 కేవీ ఎలక్ట్రిక్ స్తంభాలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రాథమిక అంచనా మేరకు రూ. 6882 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి ప్రభుత్వం నివేదికను అందజేసింది. నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యుమరేషన్ ప్రక్రియను నిన్నటి నుంచి ప్రారంభించారు.