తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు బంగారు బిస్కేట్లను విరాళంగా అందించాడు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఇవాళ ఉదయం శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు.
ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.