కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కర్నూలు (Kurnool) జిల్లాలోని కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కోడుమూరు (Kodumuru) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఎదురుగావస్తున్న బొలెరోను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పారు.
బాధితులు హోళగుంద మండలం కొత్తపేట వాసులుగా గుర్తించారు. వారి స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారని, మరొకరు దవాఖానలో మరణించారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.