IPS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 27 మంది అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనాను నియమించింది. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్‌రెడ్డిని బదిలీ చేసింది. ఐజీపీ ఆపరేషన్స్‌గా సీహెచ్ శ్రీకాంత్ నియమించింది.. ఆయనకు టెక్నికల్ సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా జీ పాలరాజు, ఏపీఎస్పీ బెటాలిన్ల ఐజీపీగా జీ రాజకుమారిని నియమించింది. ఏసీబీ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డీఐజీగా అంబురాజన్, గ్రేహౌండ్స్ డీఐజీగా బాబ్జీ, ఏపీఎస్పీ డీఐజీగా పకీరప్ప, కర్నూల్ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బదిలీ అయ్యారు.
తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు, ఏపీఎస్పీ కర్నూల్ కమాండెంట్‌గా దీపిక, లీగల్, హ్యూమన్‌రైట్స్ కోఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డిని బదిలీ చేసింది. సీఐడీ ఎస్పీలుగా పరమేశ్వర్‌రెడ్డి, శ్రీధర్, విశాఖపట్నం డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్, అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీష్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్రావు, సీఐడీ ఎస్పీగా శ్రీదేవిరావు, చక్రవర్తి, కడప ఎస్పీగా అశోక్‌కుమార్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా రమాదేవి, విజయవాడ డీసీపీ అడ్మిన్‌గా సరిత, కాకినాడ ఎస్పీగా బింధుమాధవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.