IPS Transfers | ఏపీకి చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. ఈ మేరకు బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్, పీఅండ్ఎల్ ఐజీగా ఎం రవిప్రకాశ్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణను బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, డీజీపీ కార్యాలయంలో డీఐజీ అడ్మిన్‌గా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ డీఐజీగా సీహెచ్ విజయరావు, శాంతిభద్రతల ఏఐజీగా సిద్దార్థ్ కౌశల్, విశాఖ శాంతిభద్రతల డీసీపీగా మేరీ ప్రశాంతి, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకు బాధ్యతలు అప్పగించింది.
ఏపీఎస్పీ-3 బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా జీ రాధిక, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, పీటీవో ఎస్పీగా కేఎస్వీ సుబ్బారెడ్డిని నియమించింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని బాపూజీ అట్టాడకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ కమిషనరేట్‌లో క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్‌రెడ్డిని నియమించగా.. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని శ్రీనివాసరావును ఆదేశించింది.