అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly )సమావేశాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు (TDP MLAs ) తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్( Speaker Tammineni Sitaram) వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. కాగితాలు చింపి స్పీకర్‌పై పడవేయడంతో పాటు అధికార పక్ష శాసనసభ్యుల ప్రసంగాలను తరుచూ అడ్డు్కోవడంతో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు .
కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవాని, బెందాళం అశోక్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఏలూరి సాంబశివరావు , నిమ్మకాయల చినరాజప్ప , గణబాబు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్,డోలా బాలవీరాంజనేయ స్వామి , గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణబాబును సస్పెండ్ చేశారు.