తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 71,289 మంది భక్తులు దర్శించుకోగా 33,210 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.71 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
రాత్రి పౌర్ణమి గరుడసేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామిని గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గురుపౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు, విజిఓ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి, పార్ పత్తేదార్ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.