AI Impact Summit 2026 | ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం
AI Impact Summit 2026 | న్యూఢిల్లీ వేదికగా జరిగిన మెగా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (AI Impact Summit 2026)' శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో 'న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్ (New Delhi Declaration on AI Impact)' కు ఆమోదం తెలిపారు. భారత్ సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దీనికి మద్దతు తెలిపాయి.
AI Impact Summit 2026 : న్యూఢిల్లీ వేదికగా జరిగిన మెగా ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (AI Impact Summit 2026)’ శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్ (New Delhi Declaration on AI Impact)’ కు ఆమోదం తెలిపారు. భారత్ సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దీనికి మద్దతు తెలిపాయి. ఇది ప్రపంచ ఏకాభిప్రాయానికి నిదర్శనంగా నిలిచింది.
ఆర్థికవృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఈ డిక్లరేషన్ ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ (అందరి సంక్షేమం, అందరి ఆనందం)’ అనే భారతీయ తాత్విక సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ డిక్లరేషన్‌ను రూపొందించారు. ఏఐ ద్వారా లభించే ప్రయోజనాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలనే ఆశయాన్ని ఇది పునరుద్ఘాటించింది.
‘వసుధైవ కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం)’ అనే భావనతో అన్ని దేశాలు తమ పౌరుల ప్రయోజనాల కోసం ఏఐని అభివృద్ధి చేసి, వినియోగించుకునేలా వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రాముఖ్యతను ఈ తీర్మానం నొక్కి చెప్పింది. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, అన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొనిపోవడం, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, విశ్వసనీయమైన ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారా ఏఐ పురోగతిని ప్రోత్సహించడం లాంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

