తిరుమల : ఆపదమొక్కుల వాడు కొలువు దీరిన తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 13 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
మంగళవారం భక్తగ్రేసరుడు వేంకటేశ్వర స్వామిని 73,788 మంది దర్శించుకోగా 23,449 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.65 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.