అమరావతి : మండలంలోని చేపట్టిన పనుల తాలుకూ బిల్లుల చెల్లింపునకు లంచం డిమాండ్ చేసిన ఏఈని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల ( Chilakaluripeta Mandal ) పరిషత్ కార్యాలయంలో ఏఈ ( AE ) గా పనిచేస్తున్న సత్యనారాయణ సోమవారం రూ. 24 వేలు లంచం ( Bribe ) తీసుకుంటూ రెడ్ హ్యండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఇటీవల చేపట్టిన నిర్మాణ పనులకు చెల్లించాల్సిన బిల్లుల కోసం ఏఈని కాంట్రాక్టర్ కలువగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సోమవారం వ్యూహం ప్రకారం కార్యాలయంలో రూ.24 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరారు.