హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కల్తీ మద్యం కేసులో ఆదివారం ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారు. తొలుత ఆయన ఇంట్లో సుదీర్ఘ సోదాలు చేసి న సిట్ అధికారులు.. జోగి రమేశ్‌తో పాటు ఆయన భార్య ఫోన్‌ను సీజ్ చేసి, ఇంటి సీసీ పుటేజీని సైతం స్వాధీనం చేసుకున్నారు.
జోగి రమేశ్‌తోపాటు ఆయన సోదరుడు రామును కూడా అరెస్టు చేసి విచారించారు. విచారణ అనంతరం ఇద్దరినీ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.