హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కార్తీకమాసం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈక్రమంలో శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, టాలీవుడ్ నటుడు నారా రోహిత్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, తమిళనాడు మంత్రి రామచంద్రలు శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.