ఆదివారం 25 అక్టోబర్ 2020
Agriculture - Jun 17, 2020 , 23:46:19

పవర్‌ వీడర్‌తో ఆధునిక సాగు

పవర్‌ వీడర్‌తో ఆధునిక సాగు

ట్రాక్టర్‌, ఎడ్ల కంటే తక్కువ ఖర్చు..

భైంసా: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీపంలో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పురస్తు గోపాల్‌ సాగులో ఆధునిక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. పవర్‌ వీడర్‌ సాయంతో తక్కువ ఖర్చుతో దుక్కి దున్నుతున్నారు. ఇందులో రెండు లీటర్ల పెట్రోల్‌ పోస్తే రెండు ఎకరాల వరకు దున్నుకోవచ్చని చెబుతున్నారు. దీని ధర రూ. 40 వేలు ఉంటుందన్నారు. ట్రాక్టర్‌తో చేయిస్తే గంటకు రూ. 600 కిరాయి చెల్లించాల్సి ఉంటుందని, రెండు ఎడ్లు తీసుకోవాలంటే రూ. 70 వేలు ఖర్చవుతుండటంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు. 


logo