Razakar | హైదరాబాద్ : భారత దేశ చరిత్ర ఎంతో శక్తిమంతమైన కథలతో నిండి ఉన్నది. కానీ వాటిలో చాలా కథలు బయటకు రాలేదు. అలాంటి కథల్లో హైదరాబాద్ విమోచన ఉద్యమం కూడా ఒకటి. ఎన్నో ఏండ్లుగా మరుగునపడిన ఈ కథను రజాకార్ చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. భారత దేశ సమగ్ర చరిత్రను అర్థం చేసుకోవడంలో ఈ చిత్రం ఎంతగానో దోహదపడుతుంది. ఈ సినిమాను సమరవీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై గూడురు నారాయణ రెడ్డి నిర్మించారు. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
మనసును కదిలించే కథ
1940ల్లో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న విభిన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రజాకార్ చిత్రం రూపొందింది. ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అణిచివేత శక్తులకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం, త్యాగం, ధైర్యసాహాసాలను ఈ చిత్రంలో ఎంతో గొప్పగా చూపించారు. అన్యాయానికి ఎదురు నిలబడి దేశభక్తి, ధైర్యానికి పరాకాష్ఠగా నిలిచిన వీరుల జీవితాలను కళ్లకు కట్టినట్లుగా మన ముందుంచారు.
మస్తాన్పల్లి, గోర్తా, ఔషాపూర్, అప్పంపల్లి, కంటాత్మకూర్, గుల్బర్గాతో పాటు హైదరాబాద్ అంతటా రజాకార్లు చేసిన విధ్వంసాన్ని, ప్రజలు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను హృదయానికి హత్తుకునేలా ఇందులో చిత్రీకరించారు. నిజాం అణిచివేత పాలన నుంచి ప్రజలను విముక్తి చేస్తూ పోలీసు చర్యతో భారత సైనికులు రజాకార్లపై ఎలా విజయం సాధించారో కూడా ఇందులో చూపించారు.
ఈ హిస్టారికల్ డ్రామా కేవలం వినోదాన్ని పంచడం మాత్రమే కాదు.. భారత దేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. ప్రతిఘటన స్ఫూర్తికి నివాళిగా నిలిచింది. నటీనటులు అద్భుత ప్రదర్శన, సినిమా నైపుణ్యం, మంచి కథతో వచ్చిన రజాకార్ చిత్రం గతాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు, భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దిన వీరుల త్యాగాలకు అంకితమిచ్చిన గౌరవ సూచికగా నిలిచింది.
అసాధారణమైన అనుభవం
కథనంతో పాటు విజువల్ ప్రజెంటేషన్ పరంగా కూడా రజాకార్ సినిమా అంతే గొప్పగా ఉంటుంది. ఈ సినిమా కోసం ఉపయోగించిన సెట్లు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మనల్ని హైదరాబాద్ విమోచన ఉద్యమ సమయానికి తీసుకెళ్తాయి. ప్రతి ఫ్రేమ్ కూడా ప్రేక్షకులను ఆనాటి కాలానికి తీసుకెళ్తాయి.
యాక్షన్ సీక్వెన్స్‌లు, హృదయాన్ని తాకే భావోద్వేగ ఘట్టాలు అన్నీ కూడా చరిత్ర ప్రేమికులతో పాటు సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. భారత స్వాతంత్య్ర పోరాటంలో మనకు తెలియని అధ్యాయాలను కళ్లకు కడుతున్నది. అలాగే మనం మరిచిపోతున్న వీరులను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.
భారత దేశ చరిత్ర, దాని నిర్మాణంలో భాగమైన వ్యక్తులపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం రజాకార్. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వీరోచిత గాథను మీరూ చూసేయండి.
రజాకార్ సినిమాను ఆహా యాప్‌లో చూసేందుకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://aha-web.app.link/e/JbdLIFs0pQb