ఆదిలాబాద్ : జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. జైనథ్ మండలం ధర్మం వంతెన పొంగి ప్రవహించగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జైనథ్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన లాండ్డే దత్తు (30) ఆదిలాబాద్ నుంచి మోటార్ సైకిల్‌పై తన ఇంటికి వెళ్తుండగా మధ్యలో వంతెన దాటే ప్రయత్నం చేసి అందులో పడిపోయాడు. ఉదయం దత్తు ఇంటికి రాకపోవడంతో బంధువులు వంతెన వద్ద గాలించడంతో ఆయన మోటార్ సైకిల్ లభించింది. వంతెన పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Kamal Hasan | ‘నాకు నిజమైన స్త్రీని ముద్దు పెట్టుకోవాలని ఉంది’ – ఏఐపై కమల్ హాసన్ కామెంట్స్
Gold Prices | భారీగా తగ్గిన పుత్తడి.. తులం బంగారం ఎంతంటే..?
Junior Colleges | 183 జూనియర్ కాలేజీలు క్లోజ్.. అంపశయ్యపై 101 ప్రభుత్వ, 77 ప్రైవేట్ కాలేజీలు