న్యూఢిల్లీ, మే 27: గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.800 దిగొచ్చి రూ.98,500గా నమోదైంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.800 దిగొచ్చి రూ.98 వేలుగా నమోదైంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.1,370 తగ్గి రూ.99 వేలుగా నమోదైంది. ఔన్స్ గోల్డ్ ధర 45 డాలర్లు కరిగిపోయి 3,296.92 డాలర్లుగా నమోదైంది.