Kamal Hasan On AI | కృత్రిమ మేధస్సు (artificial intelligence) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల USAలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఓ ప్రత్యేక కోర్సును అభ్యసించిన తర్వాత, ఆయన AI భవిష్యత్తు, మానవ సంబంధాలపై దాని ప్రభావం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. టెక్నాలజీలో మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా.. మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ కోర్సు తర్వాత తన అవగాహన మరింత పెరిగిందని, అయితే మానవ భావోద్వేగాలు, అనుబంధాలు చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. “నాకు నిజమైన స్త్రీని ముద్దు పెట్టుకోవాలని ఉంది కానీ, AI సృష్టించిన అమ్మాయిని ముద్దుపెట్టుకోవాలని లేదని కమల్ చమత్కరించారు.
సినిమా విషయాలకు వస్తే.. కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నంల కలయికలో 37 ఏళ్ల తర్వాత వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘థగ్ లైఫ్’. 1987లో వచ్చిన ‘నాయగన్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, ‘థగ్ లైఫ్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిలంబరసన్ (శింబు), త్రిష కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, వంటి భారీ తారాగణం నటించింది.