ఎదులాపురం, జూన్ 12 : ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియాను ‘యూరియా బుకింగ్ యాప్’ ద్వారా బుకింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌలు రైతులు, పట్టా పాసుపుస్తకం లేని రైతులు కూడా మొబైల్ నంబర్ ఆధారంగా యాప్‌లో నమోదు చేసుకుని యూరియా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. గతేడాది పంట నమోదు ప్రక్రియలో నమోదు కాని ఎన్డీఎస్, పీపీ భూముల రైతులు తమ మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నెట్ వర్ సమస్యలు ఉన్న ప్రాంతాల రైతులు సమీప రైతు వేదికల వద్ద యూరియా బుకింగ్ చేసుకోవచ్చని పేరొన్నారు. ఈ సీజన్‌కు అవసరమయ్యే జిల్లాకు 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాకు 27,227 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా, ప్రస్తుతం 23,233 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యాప్ ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. యాప్ వినియోగంపై సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 1800-123-7157ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని, ఇతర సమస్యల కోసం జిల్లా హెల్ప్ లైన్ 8977742855కు ఫోన్ చేయాలని సూచించారు.