హాజీపూర్ : ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ (Yellampalli project ) కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుడిపేట గ్రామ శివారులోని గోదావరి నది ( Godavari River 0 పై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ ( Sriramsagar ) ప్రాజెక్టు నుంచి రెండు లక్షల 30000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 39 గేట్లు ఎత్తి 2,70,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు 38వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో నాలుగు గేట్లును ఎత్తి 27 వేల 197 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనితో ఎల్లంపల్లి ప్రాజెక్టు లోనికి ఏడు లక్షల 65 వేల 798 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 40 గేట్లును ఎత్తి ఎనిమిది లక్షల 28 వేల 882 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.