నిర్మల్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వేరువేరుగా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే కలెక్టర్ అభిలాష అభినవ్ కూడా కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి సెంటర్లను ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో మంగళవారం నుంచి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తం గా ఇప్పటి వరకు కోతలు ప్రారంభం కాలేదు. మరో రెండు వారాల్లో లోకేశ్వరం, కుంటాల, సారంగాపూర్, లక్ష్మణచాంద మండలాల్లో కోతలు ఊపందుకుని ధాన్యం కేంద్రాలకు చేరే అవకాశం ఉన్నది.
గన్నీ బ్యాగుల కొరత
గన్నీ బ్యాగుల కొరత ప్రధాన సమస్యగా మారిం ది. 40 లక్షల వరకు గన్నీ బ్యాగులు అవసరమవుతా యి. ప్రస్తుతం జిల్లాలో కేవలం 12.60 లక్షలు మాత్ర మే అందుబాటులో ఉన్నాయి. వచ్చే పది రోజుల్లో దా దాపు 28 లక్షల గన్నీ బ్యాగులను సేకరించడం అధికారులకు సవాల్‌గా మారనున్నది. గన్నీ బ్యాగుల సేకరణ ఆలస్యమైతే కొనుగోళ్ల ప్రక్రియకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మి ల్లులకు కస్టమ్ మి ల్లింగ్ కోసం తరలించేందుకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చి విక్రయించిన రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డ బ్బులు జమ అయ్యేలా చూడనున్నా రు. కాగా.. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తామని, కొనుగోలు కేం ద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్ తెలిపారు.