లక్షెట్టిపేట, జూలై 31: లక్షెట్టిపేట పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిషన్ ఓజా బదిలీని నిలిపివేయాలని కోరుతూ విద్యార్థులు బుధవారం ఊత్కూర్ చౌ రస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గతంలో ఆరేళ్ల క్రితం ఈ కళాశాలలో కేవలం 45మంది విద్యార్థులే ఉండేవారని కానీ ఈ ప్రిన్సిపాల్ వచ్చాక సుమారు 1250 మంది చేరేలా కృషి చేసి, కళాశాల అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు.
రాస్తారోకోతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు వచ్చి మాట్లాడి విద్యార్థులతో ఆందోళన విరమింపజేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో దిలీప్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.